చంద్ర‌బాబు ఆ నిర్ణ‌యం ఎలా తీసుకొన్నార‌బ్బా..!


రాజ‌ధాని కోసం రైతుల నుంచి వేలాది ఎక‌రాల్ని తీసుకోవ‌టం స‌రైన నిర్ణ‌యం కాద‌ని రాజ‌ధాని పై కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల క‌మిటీ కి చైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన కేసీ శివ‌రామ‌కృష్ణ‌న్ అభిప్రాయ ప‌డ్డారు. కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక విస్తృత స‌వాళ్ల‌పై దృష్టి సారించాల్సి ఉండ‌గా, చంద్ర‌బాబు కేవ‌లం రాజ‌ధాని నిర్మాణం అంశంలోనే కూరుకొని పోతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జాతీయ దిన‌ప‌త్రిక ద హిందూ కి ఈ మేర‌కు ఆయ‌న ఒక వ్యాసం రాశారు. సాధ్య‌మైనంతం వ‌ర‌కూ సార‌వంత‌మైన పంట భూముల జోలికి వెళ్ల‌రాద‌ని నిపుణుల క‌మిటీ పేర్కొన్న‌ప్ప‌ట‌కి చంద్ర‌బాబు దానిని విస్మ‌రించి ఏడాదికి రెండు,  మూడు పంట‌లు పండే వేలాది ఎక‌రాల్ని సేక‌రించ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. రాజ‌ధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతం రాష్ట్రానికి ధాన్యాగారం వంటిది. మొత్తం భార‌త‌దేశంలోనే ముఖ్య‌మైన పంట ప్రాంతం. ఏటా రెండు, మూడు పంట‌లు పండే 30 వేల ఎక‌రాల్ని రాజ‌ధాని కోసం తీసుకోవ‌టం హ్ర‌స్వ దృష్టికి నిద‌ర్శ‌నం. ఈ చ‌ర్య ఫ‌లితంగా తాత్కాలిక ల‌బ్ది కోసం రైతులు భూ నిర్వాసితులు అవుతారు. భూగ‌ర్భ నీటీమ‌ట్టం అధికంగా గల ప్రాంతాల్లో నేల‌ను గ‌ట్టి ప‌ర‌చ‌టం, ర‌హ‌దారులు వంటి మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేయ‌టానికి నిర్మించేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. స్వాతంత్ర్యం త‌ర్వాత దేశంలో నిర్మించిన గాంధీన‌గ‌ర్‌, ఛండీగ‌ఢ్, భువ‌నేశ్వ‌ర్, ఉక్కున‌గ‌రాల్లో క‌నీస మౌళిక స‌దుపాయాల నిర్మాణానికి ఏడెనిమిదేళ్లు ప‌ట్టింది. అటువంటిది ఏపీలో ఐదేళ్ల‌లో పూర్తి అవుతుంద‌న్న‌ది అతిశ‌యోక్తి అవుతుంది. రాజ‌ధానిపై ప‌నిచేస్తున్న సింగ‌పూర్ కంపెనీలు..రాజ‌ధానికి వెలుప‌ల దాదాపు 3వేల ఎక‌రాల భూమి కావాల‌ని అడుగుతున్న‌ట్లు చెబుతున్నారు. అదే జ‌రిగితే సింగ‌పూర్ కోటాలోకి వెళ్లే భూమి వ్య‌వ‌సాయ భూమి అవుతుంది. ఈ మౌళిక సదుపాయాల‌కు పెట్టుబ‌డుల్ని అంత‌ర్జాతీయంగా స‌మీక‌రించుకోవాలి. ఈ విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం ప‌రిమితులు ఇప్ప‌టికే వెల్ల‌డ‌య్యాయి. రాయ‌ల‌సీమ సామ‌ర్థ్యానికి సంబంధించిన ప్రస్తావ‌న లేక‌పోవ‌టం దుర‌దృష్ట‌క‌రం. అన్నిప్రాంతాల స‌మ‌తుల్య అబివృద్ది మీద దృష్టి సారించాల్సి ఉండ‌గా,ఒకే చోట ఆర్థిక రాజ‌ధానిని కేంద్రీక‌రించ‌టం కూడా స‌రైన‌ది కాదు. ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధాని గా హైద‌రాబాద్ ఉండ‌వ‌చ్చు. అందుచేత అన్నీ ఆలోచించి ముందుకు వెళితే బాగుండేద‌ని శివ‌రామ‌కృష్ణ‌న్ అభిప్రాయ  ప‌డ్డారు. ఏపీ ఎదుట ఉన్న తీవ్ర‌మైన స‌వాల్ ఏటా ఉద్యోగాల క‌ల్ప‌న . కానీ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌టం లేద‌ని ఆయ‌న వివ‌రించారు. పూర్తి వ్యాసం కోసం చూడ‌వ‌చ్చు..
http://www.thehindu.com/opinion/lead/eye-on-capital-loss-in-vision/article7119521.ece?ref=topnavwidget&utm_source=topnavdd&utm_medium=topnavdropdownwidget&utm_campaign=topnavdropdown 

No comments:

Post a Comment