తెలుగు వారంటే మ‌ద్రాసీలేనా..! మ‌రి ఆ ముగ్గురి ప్ర‌స్తావ‌న ఏమిటి..!

తెలుగు వారంటే చాలా మంది ఉత్త‌రాది వారు మ‌ద్రాసీలుగా మాట్లాడుతుంటారు. కానీ, కొంద‌రు మ‌హా నేత‌ల కార‌ణంగా మాత్రం త‌ప్ప‌కుండా గుర్తుపెట్టుకొంటారు. అటువంటి ప్ర‌స్తావ‌న ఒక‌టి జ‌రిగింది.
సాక్షి ప‌త్రిక త‌ర‌పున అచీవ‌ర్స్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. దానికి ఇండియా టూడే గ్రూప్ సార‌థి శేఖ‌ర్ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న ప్ర‌సంగిస్తూ తెలుగు వారంటే మ‌ద్రాసీలుగా ఉత్త‌రాది వారు గుర్తిస్తార‌ని చెప్పారు. కానీ ముగ్గురు నేత‌ల కార‌ణంగా మాత్రం తెలుగు వారికి ప్ర‌త్యేక గుర్తింపు సాధ్యం అయిద‌ని చెప్పారు. మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు, మాజీప్ర‌ధాని పీవీ న‌ర‌సింహ‌రావు మ‌రియు దివంగ‌త మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.


 దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు చేసిన సేవ‌ల్ని కొనియాడ‌ట‌మే కాకుండా కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌లో, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో ఆయ‌న స్థానాన్ని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా అప్ప‌టి రోజుల్ని గుర్తు చేసుకొన్నారు. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయిన మ‌హా నాయ‌కుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గురించి ప్ర‌స్తావించ‌గానే స‌భికులు అంద‌రూ ఆయ‌న్ని గుర్తు చేసుకొన్నారు. ఆయ‌న‌తో త‌మ అనుబంధాన్ని నెమ‌రు వేసుకొన్నారు.
https://www.youtube.com/watch?v=aCmAUWo4FZg

No comments:

Post a Comment