చంద్ర‌బాబు ఆ నిర్ణ‌యం ఎలా తీసుకొన్నార‌బ్బా..!


రాజ‌ధాని కోసం రైతుల నుంచి వేలాది ఎక‌రాల్ని తీసుకోవ‌టం స‌రైన నిర్ణ‌యం కాద‌ని రాజ‌ధాని పై కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల క‌మిటీ కి చైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన కేసీ శివ‌రామ‌కృష్ణ‌న్ అభిప్రాయ ప‌డ్డారు. కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక విస్తృత స‌వాళ్ల‌పై దృష్టి సారించాల్సి ఉండ‌గా, చంద్ర‌బాబు కేవ‌లం రాజ‌ధాని నిర్మాణం అంశంలోనే కూరుకొని పోతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జాతీయ దిన‌ప‌త్రిక ద హిందూ కి ఈ మేర‌కు ఆయ‌న ఒక వ్యాసం రాశారు. సాధ్య‌మైనంతం వ‌ర‌కూ సార‌వంత‌మైన పంట భూముల జోలికి వెళ్ల‌రాద‌ని నిపుణుల క‌మిటీ పేర్కొన్న‌ప్ప‌ట‌కి చంద్ర‌బాబు దానిని విస్మ‌రించి ఏడాదికి రెండు,  మూడు పంట‌లు పండే వేలాది ఎక‌రాల్ని సేక‌రించ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. రాజ‌ధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతం రాష్ట్రానికి ధాన్యాగారం వంటిది. మొత్తం భార‌త‌దేశంలోనే ముఖ్య‌మైన పంట ప్రాంతం. ఏటా రెండు, మూడు పంట‌లు పండే 30 వేల ఎక‌రాల్ని రాజ‌ధాని కోసం తీసుకోవ‌టం హ్ర‌స్వ దృష్టికి నిద‌ర్శ‌నం. ఈ చ‌ర్య ఫ‌లితంగా తాత్కాలిక ల‌బ్ది కోసం రైతులు భూ నిర్వాసితులు అవుతారు. భూగ‌ర్భ నీటీమ‌ట్టం అధికంగా గల ప్రాంతాల్లో నేల‌ను గ‌ట్టి ప‌ర‌చ‌టం, ర‌హ‌దారులు వంటి మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేయ‌టానికి నిర్మించేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. స్వాతంత్ర్యం త‌ర్వాత దేశంలో నిర్మించిన గాంధీన‌గ‌ర్‌, ఛండీగ‌ఢ్, భువ‌నేశ్వ‌ర్, ఉక్కున‌గ‌రాల్లో క‌నీస మౌళిక స‌దుపాయాల నిర్మాణానికి ఏడెనిమిదేళ్లు ప‌ట్టింది. అటువంటిది ఏపీలో ఐదేళ్ల‌లో పూర్తి అవుతుంద‌న్న‌ది అతిశ‌యోక్తి అవుతుంది. రాజ‌ధానిపై ప‌నిచేస్తున్న సింగ‌పూర్ కంపెనీలు..రాజ‌ధానికి వెలుప‌ల దాదాపు 3వేల ఎక‌రాల భూమి కావాల‌ని అడుగుతున్న‌ట్లు చెబుతున్నారు. అదే జ‌రిగితే సింగ‌పూర్ కోటాలోకి వెళ్లే భూమి వ్య‌వ‌సాయ భూమి అవుతుంది. ఈ మౌళిక సదుపాయాల‌కు పెట్టుబ‌డుల్ని అంత‌ర్జాతీయంగా స‌మీక‌రించుకోవాలి. ఈ విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం ప‌రిమితులు ఇప్ప‌టికే వెల్ల‌డ‌య్యాయి. రాయ‌ల‌సీమ సామ‌ర్థ్యానికి సంబంధించిన ప్రస్తావ‌న లేక‌పోవ‌టం దుర‌దృష్ట‌క‌రం. అన్నిప్రాంతాల స‌మ‌తుల్య అబివృద్ది మీద దృష్టి సారించాల్సి ఉండ‌గా,ఒకే చోట ఆర్థిక రాజ‌ధానిని కేంద్రీక‌రించ‌టం కూడా స‌రైన‌ది కాదు. ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధాని గా హైద‌రాబాద్ ఉండ‌వ‌చ్చు. అందుచేత అన్నీ ఆలోచించి ముందుకు వెళితే బాగుండేద‌ని శివ‌రామ‌కృష్ణ‌న్ అభిప్రాయ  ప‌డ్డారు. ఏపీ ఎదుట ఉన్న తీవ్ర‌మైన స‌వాల్ ఏటా ఉద్యోగాల క‌ల్ప‌న . కానీ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌టం లేద‌ని ఆయ‌న వివ‌రించారు. పూర్తి వ్యాసం కోసం చూడ‌వ‌చ్చు..
http://www.thehindu.com/opinion/lead/eye-on-capital-loss-in-vision/article7119521.ece?ref=topnavwidget&utm_source=topnavdd&utm_medium=topnavdropdownwidget&utm_campaign=topnavdropdown 

క్యాన్స‌ర్ ను నిరోధించే మార్గం తెలుసా..!


క్యాన్స‌ర్ అంటే చాలా మందికి భ‌యం. దీనికి మందు లేద‌ని, ఇది వ‌స్తే చనిపోవ‌టం ఖాయం అనీ అనుకొంటారు. కానీ ఇది అపోహ‌. క్యాన్స‌ర్ అనేది ప్ర‌మాద‌క‌రం అనటంలో సందేహం లేదు. క్యాన్స‌ర్ ముదిరిపోతే కాపాడటం క‌ష్టం అనేది అంతే వాస్త‌వం. అయితే ఆధునిక వైద్య ప‌రిశోధ‌న‌ల పుణ్య‌మా అని క్యాన్స‌ర్ పై ప‌రిశోధ‌న‌లు బాగా పెరిగాయి. దీంతో చాలా వ‌ర‌కు క్యాన్స‌ర్ కేసుల్లో చికిత్స‌లు సాధ్యం అవుతున్నాయి. మ‌రీ ముదిరిపోయినా కూడా చికిత్స‌ల‌తో నాణ్య‌మైన శేష జీవితాన్ని అందించేందుకు వీల‌వుతోంది. .


ఆహార ప‌దార్ధాల్లో కొన్నింటికి క్యాన్స‌ర్ కు అడ్డుక‌ట్ట వేసే సామ‌ర్థ్యం ఉంటుంది. వీటిలో ప్ర‌ధాన‌మైన‌ది వెల్లుల్లి. చాలా మంది వెల్లుల్లిని దాని ఘాటైన వాస‌న కార‌ణంగా ఇష్ట ప‌డ‌రు. కానీ ఈ వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీంట్లో ఉండే ఎల‌నిన్ అనే ఎంజైమ్ క్యాన్స‌ర్ రాకుండా నివారిస్తుంది. శ‌రీరంలో అవాంఛిత క‌ణ‌జాలం పేరుకొనిపోయి స‌జీవ కణజాలాన్ని నాశ‌నం  చేయట‌మే క్యాన్స‌ర్ అన్న సంగ‌తి మ‌న‌కు తెలుసు. ఈ విధ‌మైన అవాంచిత క‌ణ‌జాలం విస్త‌రించ‌టాన్ని ఈ ఎల‌నిన్ నిరోధిస్తుంది. ఇంత‌టి మ‌హ‌త్త‌ర‌మైన ర‌సాయ‌నం వేరే ఆహార ప‌దార్థాల్లో దొర‌క‌దు. అందుచేత ప‌చ్చి వెల్లుల్లిని తింటే క్యాన్స‌ర్ కు కాస్త దూరం జ‌ర‌గ‌వ‌చ్చు. అంతే కాదండోయ్‌, ర‌క్తాన్ని శుద్ధి చేయ‌టంలోనూ కీల‌క‌పాత్ర పోషిస్తుంది. 

కంటిపరీక్షల్లో ఐ ఫోన్ యాప్

కంటిరోగులను పరీక్షించేందుకు, వారి కంటిలోని భాగాలను ఫోటోలు తీసేందుకు ఐ ఫోన్ యాప్‌ను వినియోగించవచ్చునని పరిశోధకులు అంటున్నారు. వీటితోబాటు వీడియోలు కూడా తీయవచ్చునని యూఎస్‌లోని రాస్ ఐ ఇన్సిట్యూట్ డాక్టర్లు తెలిపారు. దీనివల్ల కంటి రుగ్మతలను త్వరగా గుర్తించి చికిత్స చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

28 మంది రోగులను పరీక్షించేందుకు తమ బృందం ఐ ఎగ్జామినర్ స్మార్ట్ ఫోన్ సిస్టమ్‌ని, ఐ ఫోన్‌ని వినియోగించినట్టు వారు చెప్పారు. ఈ కొత్త విధానం  కంటి డాక్టర్లకే కాక ఆస్పత్రులకు, జనరల్ ప్రాక్టీష్‌నర్లకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని ఈ బృందం తెలిపింది. ఈ చికిత్సా విధానంలో రోగులు ఎక్కువసేపు వేచి ఉండవలసిన అవసరం ఉండదని వారు స్పష్టం చేశారు.

వామ్మో!! మొబైల్ వాడితే ఇన్ని రోగాలొస్తాయా ?


మొబైల్ ఫోన్స్ వినియోగం వల్ల పబ్లిక్ మెటాబాలిజం బారినపడుతున్నారని ఓ సర్వే స్పష్టం చేసింది. మెటాబాలిజం అంటే మనిషి శరీరంలో రసాయనిక మార్పులు చోటుచేసుకోవడమన్నమాట. ఇప్పటివరకు మొబైల్ ఫోన్స్‌ని మోతాదుకు మించి వినియోగించడంవల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతాయని ఓ ప్రచారం నడుస్తోంది. అయితే, క్యాన్సర్ మాత్రమే కాకుండా.. శరీరంలో అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, అజీర్ణం వంటి సమస్యలకు కూడా ఈ మొబైల్ వాడకమే ఓ కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తమ అధ్యయనంలో ఇదే విషయం తేలిందంటున్నారు ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీకి చెందిన రేడియేషన్ అంకాలజీ ప్రొఫెసర్ మనోజ్ శర్మ. వాస్తవానికి మొబైల్ ఫోన్స్ వాడకం వల్ల ఏయే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే కోణంలో ఇప్పటివరకు సుదీర్ఘ పరిశోధనలే జరగలేదంటున్నారు శర్మ. 
ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన మొబైల్ ఫోన్ రేడియేషన్ అండ్ హెల్త్ సదస్సులో పాల్గొన్న శర్మ మొబైల్ వాడకంపై అందరూ దృష్టిసారించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. మొబైల్‌ని మెదడుకు దగ్గరిగా పెట్టుకుని మాట్లాడటం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం లేకుండాపోలేదని... ఈ విషయంలో ఇప్పుడే శ్రద్ధ తీసుకోకపోతే ఇక భవిష్యత్‌లో ఏమీ చేయలేమని శర్మ అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ సందర్భంగా శర్మ మొబైల్ వాడకాన్ని పొగాకు వాడకంతో పోల్చారు. మొదట్లో పొగాకు కూడా ఇలాగే వచ్చింది. ఇప్పుడది ప్రపంచాన్నే హరిస్తోందని అన్నారు. అంతేకాకుండా ఈ కోణంలో జరుగుతున్న పరిశోధనలన్నింటినీ కొన్ని మొబైల్ తయారీదారులు వెనకుండి నడిపిస్తున్నవే.. అందుకే ప్రమాదకరమైన వాస్తవాలెన్నో వెలుగుచూడటం లేదని ఆవేదన వ్యక్తంచేశారాయన.

శ్వాస సంబంధిత వ్యాయామాల ద్వారా మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు

  • తాత్కలిక, దీర్ఘకాలిక మానసిక సమస్యలకు శ్వాస వ్యాయామాల ద్వారా తగ్గించవచ్చు.
  • పూర్తి శ్వాస వ్యాయామం ద్వారా మానసిక ఒత్తిడుల నుండి శరీరాన్ని విశ్రాంతి పరుస్తాయి.
  • ఈ రకమైన వ్యాయామాల వలన శ్వాస ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది.
  • కాలక్రమేనా, ఆరోగ్యకరమైన శ్వాస వ్యవస్థను & ఏలాంటి సమస్యలను కలిగి ఉండరు.
పేరులో తెలిపిన విధంగా, పూర్తి శ్వాస వ్యాయామంలో శ్వాసను పూర్తిగా మరియు లోతైగా తీసుకోవాలి. ఈ విధానంలో ముక్కు ద్వారా మాత్రమె శ్వాసను తీసుకోవాలి. ఇందులో, మీ చాతి మరియు ఉదర భాగం రెండు పైకి, క్రిందకి వస్తుంటాయి. తరువాత మీ శ్వాసను గమనించినట్లయితే, తీసుకునే శ్వాస ఉదరభాగానికి చేరుతుంది. మీ చాతి స్థిరంగానే ఉండి, పొట్ట ఒక్కటే కదలటం గమనిస్తారు. తరువాత,  శరీర కండరాల పైన ఒత్తిడి పడకుండా లేదా శ్వాస పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా శ్వాసను కొనసాగించండి. ఇలా లోతైన శ్వాస వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీరం రిలాక్స్ చెంది, మెదడు వంటి భాగాలు కూడా పూర్తిగా విశ్రాంతి చెందుతాయి.
వ్యాయామాల లెక్కింపు
వ్యాయామాల లెక్కింపుల వలన మీ శ్వాసను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. సులభ పద్దతిలో వ్యాయామాలను చేయుటకు-మీరు శ్వాస తీసుకున్న తరువాత మూడు అంకెలను లెక్కించండి, ఇలా శ్వాస వదిలిన లేదా తీసుకున్న తరువాత మూడు అంకెలను లెక్కించండి. ఇలా మీరు ఎన్ని అంకెలను అయిన లెక్కించవచ్చు. ఇలా శ్వాస తీసుకొని మూడు అంకెలను లెక్కించండి మరియు శ్వాస వదిలి మూడు అంకెలను లెక్కించండి. ఇలా లెక్కిస్తూ అకస్మాత్తుగా లోతైన శ్వాసలను తీసుకోండి. ఇలా చేయటం వలన శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోవటమే కాకుండా, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

వేసవిలో కీరదోస తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!


వేసవిలో కీరదోస తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి. నోరెండిపోవడానికి చెక్ పెట్టే కీరదోస ఆకలిని పెంచుతుంది. శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కీరదోసలో విటమిన్లు లేకపోయినా.. సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సిలికాన్, క్లోరిన్ పుష్కలంగా ఉన్నాయి. 
 
కీరదోసలోని పొటాషియం రక్తంలోని ఎరుపు కణాలను పెంపొందింపజేస్తాయి. ఊపిరితిత్తులు, కాలేయంలోని వేడిని నిరోధిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ వ్యాధులను నిరోధిస్తుంది. శరీరంలో విష పదార్థాలు చేరనీయకుండా చేయడంలో కీరదోస మెరుగ్గా పనిచేస్తుంది. దోస మెదడును బలపరుస్తుంది. తల ఉష్ణోగ్రతను నిరోధిస్తుంది. మెదడును ఉత్సాహపరుస్తుంది. కఫం, వాతాన్ని నిరోధిస్తుంది. 

ఉడికించిన టమోటాలు తింటే.. క్యాన్సర్‌కు చెక్!


ఉడికించిన టమోటోలు తినేవారికి ప్రోస్టేట్, సర్వైకల్ క్యాన్సర్‌లు రాకుండా కాపాడుతాయి. టమోటోల్లో వుండే లైకోపీన్ అనే పదార్థం ఆ రక్షణనిస్తుంది. ప్రోస్టేట్ గ్రంధి క్యాన్సర్ పురుషులలో పెరుగుతోంది. ఆడవారిలో సర్వైకల్ క్యాన్సర్ ఇప్పటికే అధికంగా వుంది కాబట్టి టమోటాని ఎక్కువగా తినండి. క్యారెట్, చిలగడదుంపలు.. చర్మ క్యాన్సర్‌ను రానివ్వవు. అలాగే ఊపిరితిత్తులు సమస్యల నుండి కాపాడతాయి.
 
గోధుమ, బియ్యం వంటివి ముతకగా వున్నవే తినడం వల్ల ఎంతో లాభముంది. అలాంటి ధాన్యం కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తాయి. బరువు పెరగనివ్వవు. గుండె జబ్బుల సమస్యలు తలెత్తనీయవు. పేగుకు మేలు చేస్తుంది. పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. దీనిలో కాల్షియం అధికమే. మెంతికూర, తోటకూర వంటివి కాల్షియం అందిస్తాయి. దీనివలన కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 

అందానికి అరటి పండు తేనే


మనందరికి తెలుసు అరటిపండులోనూ, తేనెలోనూ అద్భుతమైన న్యూట్రియంట్స్ కలిగి ఉన్నాయని. అరటి పండులోని సగభాగం తీసుకొని ఒక బౌల్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దానికి ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ముఖం పొడిబారినట్లు కనబడుతుంటే కనుక ఫేషియల్ స్టీమింగ్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసుకొని చూడండి అద్భుతమైన మార్పు కనబడుతుంది.

వేసవిలో పొడి బారిన చర్మం నివారించే బానానా ఫేస్ ప్యాక్స్


చలికాలంలో మాత్రమే కాదు వేసవి కాలంలో కూడా స్కిన్ డీహైడ్రేషన్ వల్ల చర్మం డ్రైగా మారుతుంది. ఈ డ్రై స్కిన్ నివారించుకోవడానికి వేసవిలో విరివిగా దొరికే అరటిపండ్లు బాగా సహాయపడుతాయి. అరటి పండ్లలో ఎక్కువ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, ఇవి చర్మానికి చాలా అవసరం అవుతాయి . ఇది చర్మానికి తగిన తేమను అందించడంతో పాటు, చర్మ యొక్క డ్రై నెస్ ను నివారిస్తుంది. డ్రై స్కిన్ నివారించడానికి కొన్ని బనాన ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాము. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్నిచూడటానికి యవ్వనంగా మరియు మెరిసే విధంగా మార్చేస్తాయి. డ్యామేజ్ అయిన స్కిన్ మరియు డ్రై స్కిన్ నివారించడానికి అరటిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. దీన్ని ఒక హెల్తీ మీల్ గానే కాకుండా మీ చర్మ సంరక్షణకోసం స్కిన్ డైట్ లో తీసుకోవచ్చు.